కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతుండటం, పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో లాక్‌డౌన్ మరికొన్ని రోజులు పొడిగిస్తారని వార్తలు వెలువడుతుండటం లాంటి పరిణామాల నేపథ్యంలో ఈ నెల 16న జరుగాల్సిన భారత ఆర్మీ కమాండర్ల ద్వైవార్షిక సదస్సు వాయిదా పడింది. కొవిడ్-19 కారణంగా సదస్సును వాయిదా వేస్తున్నట్టు భారత ఆర్మీ ప్రకటించింది. మన దేశం లోపల, దేశం చుట్టుపక్కల భద్రతా పరిస్థితితోపాటు ఇతర కీలక అంశాలపై ఈ సమావేశంలో ఆర్మీ కమాండర్లతో చర్చించాలని భారత భద్రతా దళాల అధిపతి బిపిన్ రావత్ భావించారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపిన ఆర్మీ వర్గాలు.. తిరిగి సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో వెల్లడించలేదు.
ఆర్మీ కమాండర్ల సదస్సు వాయిదా